Tuesday, January 27, 2026

'చెర'వులు ఏల?

'చెర'వులు ఏల? చెరువుల రక్షణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయండి న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి • గ్రేటర్ చెరువుల సమస్యలపై హైకోర్టుకు కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల రక్షణకు పలు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. ఆక్రమణలు సహా ఇతర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని, ఎఫ్టీ ఎల్/బఫర్ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్ణయించాలని, శిథిలాలు, చెత్తవేస్తే జరిమానా విధించే వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. 3 రోజుల పాటు నగరంలోని 13 చెరువులను పరిశీలించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్సీ) గాడి ప్రవీణ్ కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్ రెడ్డి, కమిటీ/అడ్వొకేట్ కమిషనర్లు నివేదికను హైకోర్టుకు అందజేసింది. ఒక్కో చెరువు వారీగా సమస్యలను ఫొటోలతో సహా నివే దికలో పొందుపర్చింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణ గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, పిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్ విచారణ స్వీకరించింది. గత విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి.. 13 చెరువుల పరిస్థితిపై నివేదికను అందజేయాలని డీఎసీజీ, జీపీ కమిటీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిటీ నివేదికను హైకోర్టుకు అందజేసింది. నివేదికలోని అంశాలివి.. తనిఖీ చేసిన చెరువులు ఇవి.. దుర్గంచెరువు(మాదాపూర్), సున్నం చెరువు (అల్లాపూర్), మేడికుంట (నానక్రాంగూడ), గోసాయికుంట(గౌలిదొడ్డి), పెద్దచెరువు (నల్లగండ్ల), పెద్ద చెరువు (గంగారామ్), మద్దెలకుంట (బైరామల్ గూడ), నల్లచెరువు (ఉప్పల్), పెద్దచెరువు (ఫిర్జాదిగూడ). అంబీర్చెరువు (కూకట్పల్లి), చిన్నదామర చెరువు (దుండిగల్), చిన్న నారాయణయుని చెరువు(అల్వాల్), బోయిన్చెరువు (హస్ మత్ పేట్) ముఖ్యంగా పరిశీలనకు వచ్చిన అంశాలివి... శిథిలాలు, చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం కారణంగా చెరువులు పూడుకుపోయాయి. • చుట్టూ ఈ పూడిక కారణంగా చెరువుల వైశాల్యం క్షీణిస్తూ వచ్చింది. • నాలాలు, కనెక్టింగ్ చానెళ్లలో ఆక్రమణలు, డంపింగ్ సమస్య తీవ్రంగా ఉంది. * పర్యవేక్షణా యంత్రాంగం పట్టించుకోలేదు. • కొన్నిచోట్ల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావించినా చట్టపరమైన వివాదాలు వారికి అడ్డంకిగా మారాయి. ఆక్రమణలు, కాలుష్యం తగ్గించడానికి సూచనలు.. • చెరువులకు సంబంధించి పెండింగ్ ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్/ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. పట్టా భూములపై ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్)/ బఫర్ కోసం ప్రాథమిక నోటిఫికేషన్లు శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. భవిష్యత్లో వివాదాలను నివారించడానికి పట్టాదార్లకు తగిన నోటీసు అందించిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు ఉండాలి. ఎఫ్ఎఎల్/బఫర్ కోసం ప్రతిపాదించిన పట్టా భూములకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదా సదరు భూ యజమానులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములను అందించాలి. * ఒకవేళ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్లను ప్రచురిస్తే.. దానిపై శాస్త్రీయ, సరైన సమీక్షను నిర్వహించవచ్చు. ఇది ఎఫ్ఎఎల్కు భవిసత్తు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సక్రమంగా నిర్వహణ ఉండేందుకు దోహదం చేస్తుంది. శాస్త్రీయత కోసం అధికారులు గ్రామ పటాలు, చెరువుల ఆకృతులు, ఆన్ సైట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. * ఆక్రమణకు పాల్పడినా, చెరువుల్లో కాలుష్య కారకాలను వదిలినా జరిమానా విధించాలి. దీని కోసం నీటి పారుదల శాఖలో ఓ నిర్దిష్ట విభాగాన్ని నెలకొల్పి అధికారాలు ఇవ్వాలి.

Thursday, July 24, 2025

1234

| Instrument = [[వేణువు]] | Genre = [[హిందుస్తానీ సంగీతము]] | Occupation = [[సంగీతకారుడు]], [[వేణువు|వేణు విద్వాంసుడు]] | Years_active = | Label = | Associated_acts = | Notable_instruments = వెదురు పిల్లనగ్రోవి (''[[బాఁసురీ]]'') {{సమాచారపెట్టె వ్యక్తి | name = దత్తాత్రేయ | {{Infobox artist|image=[[File:దత్తాత్రేయ.jpg|thumb|దత్తాత్రేయ]]}} [ | caption = దత్తాత్రేయ | birth_date = 1956 జూన్ 1 | birth_place = {{Flagicon|భారతదేశం}} | spouse = | children = | occupation = వేణు విద్వాంసుడు, సంగీతకారుడ Instrument = [[వేణువు]] | Genre = [[హిందుస్తానీ సంగీతము]] | residence = | other_names = | image = | imagesize =200px | caption = | birth_name = దత్తాత్రేయ | birth_date = {{birth date |1956|06|01}} | birth_place = {{flagicon|India}} [[టెంపుల్ ఆల్వాల్ , ]],[[సికిందరాబాద్]] [[తెలంగాణ]] రాష్ట్రం | native_place = [[టెంపుల్ ఆల్వాల్]], [[సికిందరాబాద్]] [[తెలంగాణ ]] రాష్ట్రం | Instrument = [[వేణువు]] | Genre = [[హిందుస్తానీ సంగీతము]] | Occupation = [[సంగీతకారుడు]], [[వేణువు|వేణు విద్వాంసుడు]] | Notable_instruments = వెదురు పిల్లనగ్రోవి, | religion = హిందూ | wife = | spouse= శ్యామల | partner = | children = 1.మానస మాధురి 2. సుమన ప్రీతి 3. సమీర సంధ్య | father = బాబురావు జ్యోషి | mother = రుక్మిణి | website = | footnotes = | employer = | height = | weight = }}

Tuesday, April 15, 2025

మంచిమాటలు

  మంచిమాటలు


114. మతములు వేరు - మార్గము ఒక్కటే వస్త్రము వేరు - వస్తువు ఒక్కటే

ఆభరణములు వేరు - బంగారము ఒక్కటే ఆవుల రంగులు వేరు - పాలు ఒక్కటే

జీవ జాతులు వేరు - జీవుడు ఒక్కడే పూల జాతులు వేరు - పూజ ఒక్కటే

శరీరములు వేరు. - ఆత్మ ఒక్కటే.

115. మానవ శక్తికి ఆగనిది కాలము కాలమును వృథా చేయుట - అవివేకము.  

116. భోగ భాగ్యములు అనుభవించలేదని - చింతించవద్దు.

దారిద్య  బాధలు లేవని - సంతోషించు.

117. పూజలలో ఉత్తమ పూజ - ఉపకార పూజని గ్రహించు '

118. భగవంతుని - పూజించుము భక్తుని గౌరవించుము

ప్రాణులకు - సహకరించుము సత్ఫలితము - సాధించుము

119. సద్భుద్ధిని పెంచుటకు - దుర్భుద్దిని దులుపుటకు

వాయిదాలు వేయరాదు - ముహూర్తాలు చూడరాదు

120. నిందించిన వాడిని అభినందించు ఎందుకు అభినందించాలో - మీరు ప్రశ్నించవచ్చు

నీ మలినాన్ని - తన నోటితో తీస్తానన్నందులకు - సంతోషించు

121. ఆశ్రమ మేదైనా ఆశయం మంచిదై యుండాలి సదాశయాన్నే - సదా అవలంభించాలి

తృష్ణల కన్నా - తృప్తియే మిన్న అని గ్రహించాలి

122. ఆకలి కొరకు ఆహారాన్ని ఆశించుట -ప్రకృతి ఇతరుల ఆహారాన్ని దోచుకొనుట - వికృతి

ఇతరులకు ఆహారాన్ని అందించుట - సంస్కృతి

123. ఎంత మోసినా బరువనిపించదు - బంగారం ఎంత చేసినా చాలనిపించదు - సత్సంగం

-124. అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని - ఆగవు కొన్ని జరిగేవన్నీ - మంచికని

అనుకోవడమే మనిషి పని

125. తల్లి ఒడి - పిల్లల బడి కావాలి

126. భోగ జీవనం - రోగమయం యోగ జీవనం - ఆనందమయం

127. దుఃఖ పెట్టకు - దుఃఖ పడకు

128. దృష్టిలో పవిత్రత ప్రవర్తనలో - పరిమళత్వం మాటలలో మాధుర్యం

మానవత్వానికి - మంచితనం

129. కొడుకులు కోడళ్ళు - కోటిమంది వున్నా కాటి వరకే - వత్తురో రన్నా

నీకు ఎందుకు - వ్యామోహమన్నా

130. పెద్దలను - గౌరవించుము పిన్నలకు - బోధింపుము

జ్ఞానులను - సంప్రదింపుము అజ్ఞానమును - అణగద్రొక్కుము

131. కోపమే - పాపము పాపమే - దుఃఖము దుఃఖమే - నరకము

నరకమే - మరణము

132. దురలవాట్లే - శతృవులు సద్గుణాలే - మిత్రులు 

133. ఓర్పుకు సమమైన - తపస్సు లేదు సంతుష్టికి మించిన - సుఖము లేదు

ఆశతో సమానమైన - రోగము లేదు దయకు మించిన - ధర్మము లేదు

134. భిక్షాధికారికి - ఆకలి బాధ ; లక్షాధికారికి - చాలదను బాధ

135. గుడ్డకు - జాడింపు అవసరం; దొంగకు - గాలింపు అవసరం

కూరకు - తాలింపు అవసరం; రాజుకు - పొగడింపు అవసరం

పాపకు - లాలింపు అవసరం

136. సద్విద్యతో సమానమైన - నేత్రము లేదు; సత్యముతో సమానమైన - తపస్సు లేదు

దురాశతో సమానమైన దుఃఖము లేదు; త్యాగముతో - సమానమైన - సుఖము లేదు

137. ప్రతి శబ్దానికి - ప్రతి ధ్వని ఉంటుంది; ప్రతి కర్మకు - ప్రతి క్రియ ఉంటుంది

కర్మను బట్టి - ఫలితం ఉంటుంది

138. గర్వం లేని వాడే - గమ్యం చేరగలడు; చెడు తలపెట్టిన వాడు - చెడిపోగలడు

139. భగవంతుని - ధ్యానించుము ; భక్తులను - సేవించుము

ఇదే ఉత్తమమని - భావించుము 

140. మనిషి వన్న విషయం- మరిచిపోవద్దు; మానవత్వాన్ని మలిన పరచవద్దు

మానవత్వమే లేకున్న - మనిషికే అర్ధము లేదన్న; అనైతికంగా - ప్రవర్తించకు

నైతికంగా పతనమవ్వకు;లక్ష్యము మంచిదైతే - నిర్లక్ష్యము చేయకు

141. దోచుకొని - దాచవద్దు; దాచింది - దానము చేయి.

దానము - మానవత్వం, సేవాతత్వం; దోచుట - రాక్షసత్వం

142. పరోపకార - హృదయం పరులకు - సహకారం   పరమాత్ముడుకి ప్రీతి కరం

143. సహనంతో - సహవాసం; సత్యంతో - సన్నిహితం; సత్పురుషులతో - సాంగత్యం

సదాచారానికి నిర్వచనం

144. భగవంతుడు - విత్త చోరుడు కాదని గ్రహించు; చిత్త చోరుడని - గమనించు

145. సచ్చీలము లేని మనిషి - చిల్లుల కుండవంటివాడు; సమదృష్టియే - సహజ దృష్టియై యుండాలి.

146. సుపరిపాలన కావాలి; స్వలాభం పైన - ఆసక్తి తరగాలి; లోభం పై - విరక్తి పెరగాలి

147. పరలోక ప్రయాణం - తప్పదు; పరోపకారం - తప్పకు

148. శ్వాసైనా - వదులుకో; భగవంతునిపై విశ్వాసము వదలకు

149. దేవుని పూజించు - ప్రాణికోటికి సహకరించు; ప్రాణి కోటిలో - దేవుడు వున్నాడని గమనించు

150. నోటితో దేవుని స్మరించు; చేతితో ప్రాణులకు - సహకరించు

151. ఉపకారం చేసితివా - ఊర్థ్వగతి; అపకారం చేసితివా - అధోగతి

152. సాటి మనిషికి - సహాయపడే గుణముంటే; ప్రతి మనిషి - దేవుడే

ప్రతి గృహము - దేవాలయమే; దయగల హృదయాలు - దైవమందిరాలు

153. దుర్గుణాలు అనే - దుర్గంధం అంటించుకోకు; సద్గుణాలు అనే - సుగంధం వదులుకోకు

154 అసత్యాన్ని - అనుసరించకు; సత్యాన్ని - అణగద్రొక్కకు

155. తల బరువు - తగ్గించవచ్చును; తలరాతను - తొలగించవచ్చును

మంచి పనులు చేసి - మనస్సును సవరించుము; తలరాతను - త్రోసి పుచ్చుము

156. పాములో విషమున్నను పాము - బాధించదు.

మాయ అంతటా ఉన్నను మహాత్ముల - దరి చేరదు

157. వినయం - ఉన్నతుణ్ణి చేస్తుంది; గర్వం - అధముణ్ణి చేస్తుంది

158. అహంకారమనే - వికారం వద్దు; వికారం వలన - ఆకారమే మారిపోవునని మరవవద్దు

159. సంపదలు వుంటాయి - సంతోషం ఉండదు; సంపదలు కరువైనా - సంతోషానికి కరువుండరాదు

160. అపకారికి ఉపకారం - అత్యున్నతికి సోపానం

161. ఆరాటం ఎక్కువైతే - ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరిగితే - ఆరోగ్యం తరుగుతుంది ఆరోగ్యం తరిగితే - ఆయుస్సు తగ్గుతుంది; ఆయుస్సు తగ్గితే - అసలుకే ముప్పు వస్తుంది; ఉన్న విషయం ఇది - ఆలోచించి నిర్ణయించుట నీ విధి.

162. ఆవేశం తగ్గించు - ఆలోచన పెంచు  163. కక్షను - కొనసాగించకు ; కరుణను - వదులుకోకు 164. మానవ శవాన్ని తాకితే - స్నానం చేయాలంటారు జంతువుల శవాన్ని మాత్రం తింటానంటారు; శవాలకు శ్మశానం వుందని - మరువకు నీ కడుపు శ్మశానం - కానివ్వకు; జీవకారుణ్యం గురించి - వివరిస్తానంటావు; జీవాలను మాత్రం - తింటానంటావు; మందు తింటానంటావు - పథ్యం ఆచరించనంటావు; మందు కంటే పథ్యమే ముఖ్యమని - తెలుసుకోమంటాను. 165. దురాచారుడే - దుష్టుడు;సదాచారుడే - సాధువు

దురాచారమును- దులపండి; సదాచారమును - పొందండి 

166. అహంకారము - వద్దు ; ఉపకారమే - ముద్దు 167. విశ్వమును - నమ్మకు ; విశ్వేశ్వరుని - నమ్ముము. 168. నీ బరువు - కాటాకు తెలుసు ; నీ తెలివి - అందరికి తెలుసు; నీ శక్తి - నీకే తెలుసు- నీ బలహీనత - అందరికి తెలుసు. 169. నీవు సమర్థుడవని - నీవే సర్టిఫికెట్టు ఇచ్చుకోకు - నీకు నీవే ఇచ్చుకున్న- సర్టిఫికెట్ విలువలేనిదని;  తెలుసుకో- వంతపాడుటకు

వంది మాగదులంటారు.; పనైతే - పలాయనం చిత్తగిస్తారు.; కాకుంటే - నీపై నిందల వర్షం కురిపిస్తారు.; అందుకే ఉండాలి- నీ జాగ్రత్తలో నీవు బహు జాగ్రత్తగ.

170. నోరు మంచిదైతే ఊరు మంచిదగును; ఊరు మంచిదైతే - ఉల్లాసం అధికమగును

171. నీతులు చెప్పువారు నిండుగా వున్నారు.; ఆచరించేవారు. - అరుదుగ వున్నారు.

అన్నిటికంటే సులభం - నీతులు చెప్పడం; అన్నిటి కంటే కష్టం - వాటిని ఆచరించుట

172. చట్టాలు చేస్తారు - చుట్టాలుగ మారుస్తారు. ఇదేమంటే - అంతేనంటారు.

173. చెడు ఆలోచనలతో - చెడిపోవద్దు; మంచి ఆలోచనలతో - మనిషిగ బ్రతుకు

నీతి నియమం ఉంటే - నరుడే నారాయణుడు. 174. దేహ శుద్ధి - కొంతవరకే అవసరం

చిత్త శుద్ధి, త్రికరణ శుద్ధి - అందరికి అవసరం 175. చెడు చేయకు మంచిని వదలకు

చెడు తలపెట్టకు - మంచిని వదిలిపెట్టకు 176. డబ్బుతో - అవసరములు సమకూరును

అత్యధిక డబ్బుతో - విలాసములు సమకూరును.; సంతృప్తితో - శాంతి సమకూరును

అసంతృప్తితో - అశాంతి వెంటాడును. 177. స్వచ్ఛమైన మానవత్వమే - దైవత్వము; కరుణ - మానవత్వము;  కాఠిన్యము - రాక్షసత్వము  178. గౌరవానికి హాని కలిగించకు - అగౌరవాన్ని పెంచి పోషించకు. 179. పశుత్వాన్ని పారద్రోలుము; మానవత్వాన్ని - చేరదీయుము

దైవత్వాన్ని పొందగోరుము.  180. మనలను - పొగుడుతున్న అబద్దాన్ని

త్వరితంగా - స్వీకరిస్తాం;  మనకు - చెడు గలిగే నిజాన్ని - జీర్ణించుకోలేక ఏడుస్తాం

181. బహిరంగంగా కనిపించే - మురికి గుంట వలన ప్రమాదం - తక్కువ ; మనస్సులో మాలిన్యం - గల వ్యక్తుల వల్ల ప్రమాదం ఎక్కువ. 182. చెడు వాగుడు వాగి - చెడిపోకు

నోటిని కలుషితం చేసుకోకు;  కాలుజారితే - కొంత బాధను తెలుసుకో ;  నోరు జారితే - అమితబాధని గ్రహించు; నోటిని అదుపులో ఉంచుకొనుట మంచిదని భావించుకో; నోటికి మీటరు అవసరమని తెలుసుకో; ఆ మీటరు బిల్లు - పెరగకుండా చూసుకో

183. పుచ్చుకొనుట - అందరికి తెలుసు - ఇచ్చుకొనుట - కొందరికే తెలుసు.

184. కొన్ని - చూడదగినవి- మరికొన్ని - వినదగినవి- కొన్నే - జీర్ణించుకోదగినవి

185. ముందు - వినాలి - తదుపరి - గ్రహించాలి - ఆపై - ఆలోచించాలి - అటుపై - నిర్ధారణ చేసుకోవాలి - ఆ తరువాతనే - మాట్లాడాలి.. 186. దైవాన్ని - పూజించు - జీవున్ని - ప్రేమించు

జీవులను బాధిస్తూ - దేవుని పూజిస్తే - ఆవగింజంత - ఫలితముండదని భావించు.

187. నిజాలనే పలుకు - నిజాయితీగా బ్రతుకు- నొప్పించే మాటలు - వద్దు.  మెప్పించే మాటలు - మరవవద్దు- మనస్సును గాయపరచవద్దు - మనిషికి చేటు తేవద్దు

188. మంచినే నేర్చుకో - మంచినే అమలు పరచుకో- అపకారం చేయకు - అధోగతి చెందకు

ఉపకారం చేసి - ఉత్తమ గతి పొందుము. 189. గౌరవము నీకు అవసరమని భావిస్తావు

అందరికి - అనవసరమని ఊహిస్తావు. 190. మర్యాదను పుచ్చుకొనుటలో - శ్రద్ధ చూపిస్తావు

ఇచ్చుకొనుటలో - అశ్రద్ధ చూపించకుము. 192. అనుకూలములో ఆనందించుట అందరికీ తెలుసు. ప్రతికూలములో - ఆందించుట కొందరికే తెలుసు. 193. చెడ్డపని చేస్తావు - మంచి తనాన్ని మంట కలుపుతావు- చెడ్డపని చేయకు - మంచితనాన్ని మానకు.

194. సత్యం కొరకు - దేనినైనా వదలుకో- సత్యాన్ని దేనికోసం - త్యాగం చేయకు

195. సహనం కన్నా - సాహసం మిన్న. సాహసంతో - సమస్తం సాధించగలరన్న నీ శక్తినంతా - మంచి పనులకే ఉపయోగించన్న. 196. పరులను - పీడించుటకు ప్రణాళికలను -సిద్ధపరచకు; పరులకు - సహకరించుటకు నీ శక్తి యుక్తులను ఉపయోగించుట మరువకు.

197. మంచి చేయుటకు - ముందుండుము; ఆటంకాలను - అదర కొట్టుము

198. నీ ప్రవర్తన ప్రపంచానికి - ప్రయోజనం కావాలి. అదే నీ జీవిత ధ్యేయంగా - మారాలి

199. బోధనలు - బాధలు కారాదు; బోధనలతో - బాధలు తీరాలి-ఆనందం - అందరికీ అందివ్వ గలగాలి. 200, శాంతిని - పంచాలి.;  అశాంతిని - అణ చాలి.  201. నీవు మరణించినా - ప్రజల హృదయంలో జీవించగలగాలి;  నీవు జీవించినా - ప్రజల హృదయంలో మరణించరాదు. 202. మానవత్వానికి - మచ్చ రానీయకు- మానవత్వమే - మధురమైనదని మరువకు. 

203. గుడికి ఎందుకు రాలేదని.- ఏ దేవుడు - ప్రశ్నించడు; పరులకు ఎందుకు - మేలు చేయలేదని మాత్రం తప్పక - ప్రశ్నిస్తారు. 204 హింసను - ప్రేరేపించకు- అహింసను-వదిలి పెట్టకు. 205. నీవు - స్వతంత్రుడవే - ఎవరూ కాదనరు - ఇతరులను హింసించుటకు

దానిని ఉపయోగించకు.  206. పాపిని - దూషించకు - పాపాన్ని - దూషించు

పాపాన్ని - వదిలించు - పాపిని - రక్షించు.  207. కల్లు - తాగిన వానిని - కైపు - ఆడిస్తుంది.

కల్లును - ద్వేషించు - మనిషిని - రక్షించు. 208 ఎవరి కోపం - వారిని ఆడిస్తుంది. - ఎదుటి వారిని - హింసిస్తుంది. 209. కోపం - తెప్పించినవానిని - ఓడించాలని - భావించావా! - నీవు - కోపాన్ని అణుచుకో కోపం తెప్పించిన వానిని గెలిపించి - నీవు ఓడిపోవాలని భావించితివా!

కోపగించుకుని - నీ కొంప నీవే ముంచుకో. 210. స్వయం కృషిని - నమ్ముకో అంతా మంచియే జరుగునని అనుకో.  

211. దురదృష్టమని - దిగజారిపోకు అదృష్టముపై - ఆశ వదులుకోకు. 212. ఆత్మ బలమే - అధిక బలము; మనో బలమే - మంచి బలము; ఆత్మ సాక్షిని - అదిమి పెట్టకు మనస్సాక్షిని - వదిలిపెట్టకు. 213. నీ వైఫల్యాన్ని - ఇతరుల మీద నెట్టకు; నీ సాఫల్యాన్ని - ఇతరులతో పంచుకో. 214. ప్రపంచం ఏ ఒక్కడి - సొత్తూ కాదు ఇందులో అందరికి వాటా ఉంది. నాది నాది అని దాచుకున్నా- దాగదు ఏదీ నీది కాదు అంతా నాదే అంటుంది ప్రకృతి. 215. ఎంత ఎత్తుకు - చేరుకున్నావనేది ముఖ్యం కాదు అంత ఎత్తుకు - ఏ విధంగా చేరుకున్నావనేది ముఖ్యం. 216. గందరగోళం చేసి - గలాటాలు చేయవద్దు; సమస్యను సామరస్యంగా పరిష్కరించుట మరవవద్దు. 217. సహకరించుటకు సమయం లేదని సరిపెట్టకు - మనస్సుంటే - మార్గముంటుందని మరువకు. 218. మంచి చేస్తానని మాట ఇవ్వు ఇచ్చిన మాటకు - కట్టుబడి ఉండు. 

219. చెప్పవలసింది - సూక్ష్మంగా చెప్పు వివరిస్తానని - సమయాన్ని అరగదీయకు. 

220. పరులను బాధించా - నీవు రోధిస్తావని తెలుసుకో పరులకు సహకరిస్తావా - నీ పని సఫలమయ్యిందని తెలుసుకో. 221. అధికారం కొరకు అడ్డదారి త్రొక్కకు - అడ్డదారి -  అంధకారమని మరువకు. 222. వద్దన్నా వచ్చిన అధికారమే నీకు ముద్దు - అహంకారమే - నీకు వద్దు.  223. హద్దు లేని - ఆశ వద్దు - హద్దులోనే వుంది ముద్దు - అత్యాశ - అసలే-వద్దు.

224. సముద్రం కన్నా సహనం మిన్నా

'చెర'వులు ఏల?

'చెర'వులు ఏల? చెరువుల రక్షణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయండి న్యాయ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి • గ్రేటర్ చెరువుల సమస్యలపై...