మంచిమాటలు
114. మతములు వేరు - మార్గము ఒక్కటే వస్త్రము వేరు - వస్తువు ఒక్కటే
ఆభరణములు వేరు - బంగారము ఒక్కటే ఆవుల రంగులు వేరు - పాలు ఒక్కటే
జీవ జాతులు వేరు - జీవుడు ఒక్కడే పూల జాతులు వేరు - పూజ ఒక్కటే
శరీరములు వేరు. - ఆత్మ ఒక్కటే.
115. మానవ శక్తికి ఆగనిది కాలము కాలమును వృథా చేయుట - అవివేకము.
116. భోగ భాగ్యములు అనుభవించలేదని - చింతించవద్దు.
దారిద్య బాధలు లేవని - సంతోషించు.
117. పూజలలో ఉత్తమ పూజ - ఉపకార పూజని గ్రహించు '
118. భగవంతుని - పూజించుము భక్తుని గౌరవించుము
ప్రాణులకు - సహకరించుము సత్ఫలితము - సాధించుము
119. సద్భుద్ధిని పెంచుటకు - దుర్భుద్దిని దులుపుటకు
వాయిదాలు వేయరాదు - ముహూర్తాలు చూడరాదు
120. నిందించిన వాడిని అభినందించు ఎందుకు అభినందించాలో - మీరు ప్రశ్నించవచ్చు
నీ మలినాన్ని - తన నోటితో తీస్తానన్నందులకు - సంతోషించు
121. ఆశ్రమ మేదైనా ఆశయం మంచిదై యుండాలి సదాశయాన్నే - సదా అవలంభించాలి
తృష్ణల కన్నా - తృప్తియే మిన్న అని గ్రహించాలి
122. ఆకలి కొరకు ఆహారాన్ని ఆశించుట -ప్రకృతి ఇతరుల ఆహారాన్ని దోచుకొనుట - వికృతి
ఇతరులకు ఆహారాన్ని అందించుట - సంస్కృతి
123. ఎంత మోసినా బరువనిపించదు - బంగారం ఎంత చేసినా చాలనిపించదు - సత్సంగం
-124. అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని - ఆగవు కొన్ని జరిగేవన్నీ - మంచికని
అనుకోవడమే మనిషి పని
125. తల్లి ఒడి - పిల్లల బడి కావాలి
126. భోగ జీవనం - రోగమయం యోగ జీవనం - ఆనందమయం
127. దుఃఖ పెట్టకు - దుఃఖ పడకు
128. దృష్టిలో పవిత్రత ప్రవర్తనలో - పరిమళత్వం మాటలలో మాధుర్యం
మానవత్వానికి - మంచితనం
129. కొడుకులు కోడళ్ళు - కోటిమంది వున్నా కాటి వరకే - వత్తురో రన్నా
నీకు ఎందుకు - వ్యామోహమన్నా
130. పెద్దలను - గౌరవించుము పిన్నలకు - బోధింపుము
జ్ఞానులను - సంప్రదింపుము అజ్ఞానమును - అణగద్రొక్కుము
131. కోపమే - పాపము పాపమే - దుఃఖము దుఃఖమే - నరకము
నరకమే - మరణము
132. దురలవాట్లే - శతృవులు సద్గుణాలే - మిత్రులు
133. ఓర్పుకు సమమైన - తపస్సు లేదు సంతుష్టికి మించిన - సుఖము లేదు
ఆశతో సమానమైన - రోగము లేదు దయకు మించిన - ధర్మము లేదు
134. భిక్షాధికారికి - ఆకలి బాధ ; లక్షాధికారికి - చాలదను బాధ
135. గుడ్డకు - జాడింపు అవసరం; దొంగకు - గాలింపు అవసరం
కూరకు - తాలింపు అవసరం; రాజుకు - పొగడింపు అవసరం
పాపకు - లాలింపు అవసరం
136. సద్విద్యతో సమానమైన - నేత్రము లేదు; సత్యముతో సమానమైన - తపస్సు లేదు
దురాశతో సమానమైన దుఃఖము లేదు; త్యాగముతో - సమానమైన - సుఖము లేదు
137. ప్రతి శబ్దానికి - ప్రతి ధ్వని ఉంటుంది; ప్రతి కర్మకు - ప్రతి క్రియ ఉంటుంది
కర్మను బట్టి - ఫలితం ఉంటుంది
138. గర్వం లేని వాడే - గమ్యం చేరగలడు; చెడు తలపెట్టిన వాడు - చెడిపోగలడు
139. భగవంతుని - ధ్యానించుము ; భక్తులను - సేవించుము
ఇదే ఉత్తమమని - భావించుము
140. మనిషి వన్న విషయం- మరిచిపోవద్దు; మానవత్వాన్ని మలిన పరచవద్దు
మానవత్వమే లేకున్న - మనిషికే అర్ధము లేదన్న; అనైతికంగా - ప్రవర్తించకు
నైతికంగా పతనమవ్వకు;లక్ష్యము మంచిదైతే - నిర్లక్ష్యము చేయకు
141. దోచుకొని - దాచవద్దు; దాచింది - దానము చేయి.
దానము - మానవత్వం, సేవాతత్వం; దోచుట - రాక్షసత్వం
142. పరోపకార - హృదయం పరులకు - సహకారం పరమాత్ముడుకి ప్రీతి కరం
143. సహనంతో - సహవాసం; సత్యంతో - సన్నిహితం; సత్పురుషులతో - సాంగత్యం
సదాచారానికి నిర్వచనం
144. భగవంతుడు - విత్త చోరుడు కాదని గ్రహించు; చిత్త చోరుడని - గమనించు
145. సచ్చీలము లేని మనిషి - చిల్లుల కుండవంటివాడు; సమదృష్టియే - సహజ దృష్టియై యుండాలి.
146. సుపరిపాలన కావాలి; స్వలాభం పైన - ఆసక్తి తరగాలి; లోభం పై - విరక్తి పెరగాలి
147. పరలోక ప్రయాణం - తప్పదు; పరోపకారం - తప్పకు
148. శ్వాసైనా - వదులుకో; భగవంతునిపై విశ్వాసము వదలకు
149. దేవుని పూజించు - ప్రాణికోటికి సహకరించు; ప్రాణి కోటిలో - దేవుడు వున్నాడని గమనించు
150. నోటితో దేవుని స్మరించు; చేతితో ప్రాణులకు - సహకరించు
151. ఉపకారం చేసితివా - ఊర్థ్వగతి; అపకారం చేసితివా - అధోగతి
152. సాటి మనిషికి - సహాయపడే గుణముంటే; ప్రతి మనిషి - దేవుడే
ప్రతి గృహము - దేవాలయమే; దయగల హృదయాలు - దైవమందిరాలు
153. దుర్గుణాలు అనే - దుర్గంధం అంటించుకోకు; సద్గుణాలు అనే - సుగంధం వదులుకోకు
154 అసత్యాన్ని - అనుసరించకు; సత్యాన్ని - అణగద్రొక్కకు
155. తల బరువు - తగ్గించవచ్చును; తలరాతను - తొలగించవచ్చును
మంచి పనులు చేసి - మనస్సును సవరించుము; తలరాతను - త్రోసి పుచ్చుము
156. పాములో విషమున్నను పాము - బాధించదు.
మాయ అంతటా ఉన్నను మహాత్ముల - దరి చేరదు
157. వినయం - ఉన్నతుణ్ణి చేస్తుంది; గర్వం - అధముణ్ణి చేస్తుంది
158. అహంకారమనే - వికారం వద్దు; వికారం వలన - ఆకారమే మారిపోవునని మరవవద్దు
159. సంపదలు వుంటాయి - సంతోషం ఉండదు; సంపదలు కరువైనా - సంతోషానికి కరువుండరాదు
160. అపకారికి ఉపకారం - అత్యున్నతికి సోపానం
161. ఆరాటం ఎక్కువైతే - ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరిగితే - ఆరోగ్యం తరుగుతుంది ఆరోగ్యం తరిగితే - ఆయుస్సు తగ్గుతుంది; ఆయుస్సు తగ్గితే - అసలుకే ముప్పు వస్తుంది; ఉన్న విషయం ఇది - ఆలోచించి నిర్ణయించుట నీ విధి.
162. ఆవేశం తగ్గించు - ఆలోచన పెంచు 163. కక్షను - కొనసాగించకు ; కరుణను - వదులుకోకు 164. మానవ శవాన్ని తాకితే - స్నానం చేయాలంటారు జంతువుల శవాన్ని మాత్రం తింటానంటారు; శవాలకు శ్మశానం వుందని - మరువకు నీ కడుపు శ్మశానం - కానివ్వకు; జీవకారుణ్యం గురించి - వివరిస్తానంటావు; జీవాలను మాత్రం - తింటానంటావు; మందు తింటానంటావు - పథ్యం ఆచరించనంటావు; మందు కంటే పథ్యమే ముఖ్యమని - తెలుసుకోమంటాను. 165. దురాచారుడే - దుష్టుడు;సదాచారుడే - సాధువు
దురాచారమును- దులపండి; సదాచారమును - పొందండి
166. అహంకారము - వద్దు ; ఉపకారమే - ముద్దు 167. విశ్వమును - నమ్మకు ; విశ్వేశ్వరుని - నమ్ముము. 168. నీ బరువు - కాటాకు తెలుసు ; నీ తెలివి - అందరికి తెలుసు; నీ శక్తి - నీకే తెలుసు- నీ బలహీనత - అందరికి తెలుసు. 169. నీవు సమర్థుడవని - నీవే సర్టిఫికెట్టు ఇచ్చుకోకు - నీకు నీవే ఇచ్చుకున్న- సర్టిఫికెట్ విలువలేనిదని; తెలుసుకో- వంతపాడుటకు
వంది మాగదులంటారు.; పనైతే - పలాయనం చిత్తగిస్తారు.; కాకుంటే - నీపై నిందల వర్షం కురిపిస్తారు.; అందుకే ఉండాలి- నీ జాగ్రత్తలో నీవు బహు జాగ్రత్తగ.
170. నోరు మంచిదైతే ఊరు మంచిదగును; ఊరు మంచిదైతే - ఉల్లాసం అధికమగును
171. నీతులు చెప్పువారు నిండుగా వున్నారు.; ఆచరించేవారు. - అరుదుగ వున్నారు.
అన్నిటికంటే సులభం - నీతులు చెప్పడం; అన్నిటి కంటే కష్టం - వాటిని ఆచరించుట
172. చట్టాలు చేస్తారు - చుట్టాలుగ మారుస్తారు. ఇదేమంటే - అంతేనంటారు.
173. చెడు ఆలోచనలతో - చెడిపోవద్దు; మంచి ఆలోచనలతో - మనిషిగ బ్రతుకు
నీతి నియమం ఉంటే - నరుడే నారాయణుడు. 174. దేహ శుద్ధి - కొంతవరకే అవసరం
చిత్త శుద్ధి, త్రికరణ శుద్ధి - అందరికి అవసరం 175. చెడు చేయకు మంచిని వదలకు
చెడు తలపెట్టకు - మంచిని వదిలిపెట్టకు 176. డబ్బుతో - అవసరములు సమకూరును
అత్యధిక డబ్బుతో - విలాసములు సమకూరును.; సంతృప్తితో - శాంతి సమకూరును
అసంతృప్తితో - అశాంతి వెంటాడును. 177. స్వచ్ఛమైన మానవత్వమే - దైవత్వము; కరుణ - మానవత్వము; కాఠిన్యము - రాక్షసత్వము 178. గౌరవానికి హాని కలిగించకు - అగౌరవాన్ని పెంచి పోషించకు. 179. పశుత్వాన్ని పారద్రోలుము; మానవత్వాన్ని - చేరదీయుము
దైవత్వాన్ని పొందగోరుము. 180. మనలను - పొగుడుతున్న అబద్దాన్ని
త్వరితంగా - స్వీకరిస్తాం; మనకు - చెడు గలిగే నిజాన్ని - జీర్ణించుకోలేక ఏడుస్తాం
181. బహిరంగంగా కనిపించే - మురికి గుంట వలన ప్రమాదం - తక్కువ ; మనస్సులో మాలిన్యం - గల వ్యక్తుల వల్ల ప్రమాదం ఎక్కువ. 182. చెడు వాగుడు వాగి - చెడిపోకు
నోటిని కలుషితం చేసుకోకు; కాలుజారితే - కొంత బాధను తెలుసుకో ; నోరు జారితే - అమితబాధని గ్రహించు; నోటిని అదుపులో ఉంచుకొనుట మంచిదని భావించుకో; నోటికి మీటరు అవసరమని తెలుసుకో; ఆ మీటరు బిల్లు - పెరగకుండా చూసుకో
183. పుచ్చుకొనుట - అందరికి తెలుసు - ఇచ్చుకొనుట - కొందరికే తెలుసు.
184. కొన్ని - చూడదగినవి- మరికొన్ని - వినదగినవి- కొన్నే - జీర్ణించుకోదగినవి
185. ముందు - వినాలి - తదుపరి - గ్రహించాలి - ఆపై - ఆలోచించాలి - అటుపై - నిర్ధారణ చేసుకోవాలి - ఆ తరువాతనే - మాట్లాడాలి.. 186. దైవాన్ని - పూజించు - జీవున్ని - ప్రేమించు
జీవులను బాధిస్తూ - దేవుని పూజిస్తే - ఆవగింజంత - ఫలితముండదని భావించు.
187. నిజాలనే పలుకు - నిజాయితీగా బ్రతుకు- నొప్పించే మాటలు - వద్దు. మెప్పించే మాటలు - మరవవద్దు- మనస్సును గాయపరచవద్దు - మనిషికి చేటు తేవద్దు
188. మంచినే నేర్చుకో - మంచినే అమలు పరచుకో- అపకారం చేయకు - అధోగతి చెందకు
ఉపకారం చేసి - ఉత్తమ గతి పొందుము. 189. గౌరవము నీకు అవసరమని భావిస్తావు
అందరికి - అనవసరమని ఊహిస్తావు. 190. మర్యాదను పుచ్చుకొనుటలో - శ్రద్ధ చూపిస్తావు
ఇచ్చుకొనుటలో - అశ్రద్ధ చూపించకుము. 192. అనుకూలములో ఆనందించుట అందరికీ తెలుసు. ప్రతికూలములో - ఆందించుట కొందరికే తెలుసు. 193. చెడ్డపని చేస్తావు - మంచి తనాన్ని మంట కలుపుతావు- చెడ్డపని చేయకు - మంచితనాన్ని మానకు.
194. సత్యం కొరకు - దేనినైనా వదలుకో- సత్యాన్ని దేనికోసం - త్యాగం చేయకు
195. సహనం కన్నా - సాహసం మిన్న. సాహసంతో - సమస్తం సాధించగలరన్న నీ శక్తినంతా - మంచి పనులకే ఉపయోగించన్న. 196. పరులను - పీడించుటకు ప్రణాళికలను -సిద్ధపరచకు; పరులకు - సహకరించుటకు నీ శక్తి యుక్తులను ఉపయోగించుట మరువకు.
197. మంచి చేయుటకు - ముందుండుము; ఆటంకాలను - అదర కొట్టుము
198. నీ ప్రవర్తన ప్రపంచానికి - ప్రయోజనం కావాలి. అదే నీ జీవిత ధ్యేయంగా - మారాలి
199. బోధనలు - బాధలు కారాదు; బోధనలతో - బాధలు తీరాలి-ఆనందం - అందరికీ అందివ్వ గలగాలి. 200, శాంతిని - పంచాలి.; అశాంతిని - అణ చాలి. 201. నీవు మరణించినా - ప్రజల హృదయంలో జీవించగలగాలి; నీవు జీవించినా - ప్రజల హృదయంలో మరణించరాదు. 202. మానవత్వానికి - మచ్చ రానీయకు- మానవత్వమే - మధురమైనదని మరువకు.
203. గుడికి ఎందుకు రాలేదని.- ఏ దేవుడు - ప్రశ్నించడు; పరులకు ఎందుకు - మేలు చేయలేదని మాత్రం తప్పక - ప్రశ్నిస్తారు. 204 హింసను - ప్రేరేపించకు- అహింసను-వదిలి పెట్టకు. 205. నీవు - స్వతంత్రుడవే - ఎవరూ కాదనరు - ఇతరులను హింసించుటకు
దానిని ఉపయోగించకు. 206. పాపిని - దూషించకు - పాపాన్ని - దూషించు
పాపాన్ని - వదిలించు - పాపిని - రక్షించు. 207. కల్లు - తాగిన వానిని - కైపు - ఆడిస్తుంది.
కల్లును - ద్వేషించు - మనిషిని - రక్షించు. 208 ఎవరి కోపం - వారిని ఆడిస్తుంది. - ఎదుటి వారిని - హింసిస్తుంది. 209. కోపం - తెప్పించినవానిని - ఓడించాలని - భావించావా! - నీవు - కోపాన్ని అణుచుకో కోపం తెప్పించిన వానిని గెలిపించి - నీవు ఓడిపోవాలని భావించితివా!
కోపగించుకుని - నీ కొంప నీవే ముంచుకో. 210. స్వయం కృషిని - నమ్ముకో అంతా మంచియే జరుగునని అనుకో.
211. దురదృష్టమని - దిగజారిపోకు అదృష్టముపై - ఆశ వదులుకోకు. 212. ఆత్మ బలమే - అధిక బలము; మనో బలమే - మంచి బలము; ఆత్మ సాక్షిని - అదిమి పెట్టకు మనస్సాక్షిని - వదిలిపెట్టకు. 213. నీ వైఫల్యాన్ని - ఇతరుల మీద నెట్టకు; నీ సాఫల్యాన్ని - ఇతరులతో పంచుకో. 214. ప్రపంచం ఏ ఒక్కడి - సొత్తూ కాదు ఇందులో అందరికి వాటా ఉంది. నాది నాది అని దాచుకున్నా- దాగదు ఏదీ నీది కాదు అంతా నాదే అంటుంది ప్రకృతి. 215. ఎంత ఎత్తుకు - చేరుకున్నావనేది ముఖ్యం కాదు అంత ఎత్తుకు - ఏ విధంగా చేరుకున్నావనేది ముఖ్యం. 216. గందరగోళం చేసి - గలాటాలు చేయవద్దు; సమస్యను సామరస్యంగా పరిష్కరించుట మరవవద్దు. 217. సహకరించుటకు సమయం లేదని సరిపెట్టకు - మనస్సుంటే - మార్గముంటుందని మరువకు. 218. మంచి చేస్తానని మాట ఇవ్వు ఇచ్చిన మాటకు - కట్టుబడి ఉండు.
219. చెప్పవలసింది - సూక్ష్మంగా చెప్పు వివరిస్తానని - సమయాన్ని అరగదీయకు.
220. పరులను బాధించా - నీవు రోధిస్తావని తెలుసుకో పరులకు సహకరిస్తావా - నీ పని సఫలమయ్యిందని తెలుసుకో. 221. అధికారం కొరకు అడ్డదారి త్రొక్కకు - అడ్డదారి - అంధకారమని మరువకు. 222. వద్దన్నా వచ్చిన అధికారమే నీకు ముద్దు - అహంకారమే - నీకు వద్దు. 223. హద్దు లేని - ఆశ వద్దు - హద్దులోనే వుంది ముద్దు - అత్యాశ - అసలే-వద్దు.
224. సముద్రం కన్నా సహనం మిన్నా
No comments:
Post a Comment